దేవాలయాలఅభివృద్ధికి బాధ్యతతో కృషి చేయండి

Published: Tuesday February 09, 2021
దేవాలయాల అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన చైర్మన్లు ధర్మ కర్తలు బాధ్యతతో కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు సోమవారం
మధిర నియోజకవర్గ కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయం రామాలయం వినాయక దేవాలయాలకు ఎండోమెంట్, ప్రభుత్వ సహకారంతో నూతన చైర్మన్ లను సోమవారం నియమించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రమాణ స్వీకారోత్సవ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ నూతనంగా దేవాలయాలకు చైర్మన్ గా ఎన్నికైన వారు ఆయా దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గతంలో ఉత్సవ కమిటీ ఉండేదని ఈసారి టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించిన ఈ నేపథ్యంలో తదనుగుణంగా ఆలయాల అభివృద్ధికి పాట పడాల్సిన అవసరం పాల కమిటీలకు ఉన్నదని పేర్కొన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి ప్రధాన ముందుకు సాగుతుందని పేర్కొన్నారు ఆలయాల అభివృద్ధికి సంక్షేమానికి ప్రభుత్వం ద్వారా నిధుల మంజూరుకు తాను జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తోడ్పాటుతో మధిర ప్రాంత ప్రజలు ఆకాంక్షించిన రీతిలో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు సంవత్సరకాలం పాటు ఈ కమిటీలు ఉంటాయన్నారు. రానున్న శివరాత్రి ఉత్సవాలను శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రజల భక్తుల అభీష్టం మేరకు నిర్వహించి మంచి పేరు తెచ్చుకోవాలని కమిటీకి సూచించారు. అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ ఎంతో గొప్ప పార్టీ అని ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో అద్భుతమైన పాలన రాష్ట్రంలో జరుగుతుందని జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముందుగా వినాయకుని గుడి ఆలయ చైర్మన్ గా మిరియాల సీతారామయ్య రామయ్య చైర్మన్గా దొడ్డ మురళి, శివాలయం చైర్మన్గా వంకాయలపాటి నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లతా జయకర్, ఎంపీపీ లలిత, మార్కెట్ కమిటీ చైర్మన్  చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు దేవిశెట్టి రంగా రావు, పట్టణ కార్యదర్శి  అరిగె శ్రీనివాసరావు మండల కార్యదర్శి బొగ్గుల భాస్కర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యా లత వెంకటరెడ్డి, టిఆర్ఎస్ పట్టణ బాధ్యులు కనుమూరి వెంకటేశ్వరరావు, పట్టణ ప్రముఖులు కోన జనార్దన్ రావు పుతుంభాక శ్రీ కృష్ణ ప్రసాద్ వాటివల్ల సత్యంబాబు అన్న ఫౌండేషన్ చైర్మన్ మేళం శ్రీనివాస్ యాదవ్ వార్డు కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు.