ప్రజా పాలనకు పదహారేళ్లు..

Published: Wednesday May 17, 2023

తెలుగు ప్రజల గొంతుక కు  వేదికగా ప్రజాపాలన.
...నాడు బహుజనులకు వేదికగా, నేడు తెలుగు ప్రజల గొంతు కగా...!
...  రాష్ట్రాల పురోగతి కోసం, ప్రజాఉద్యమాల నిర్మాణంలో  కీలకం మయ్యింది
....అడ్డంకులు అధిగమిస్తూ... అవరోధాలు దాటుకుంటూ 16 ఏళ్ళు పూర్తి చేసుకుని ముందుకు.
....కటికెల శివభాగ్య రావ్ సారథ్యం లో మూడు ఎడిషన్లతో పత్రికా రంగంలో ప్రభంజనం సృష్టిస్తున్న ప్రజా పాలన
.... పత్రికా రంగంలో విలువలతో కూడిన సమాచారం అందిస్తున్న ప్రజాపాలన.

 

భారత్‌‌లో లక్షకుపైగా వార్తా పత్రికలతో పాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్‌‌ చానళ్లు ఉన్నాయి. అయినా బహుజనుల గొంతుక వినిపించడంలేదు.  అగ్ర వర్ణాల వారి చెతిలో పత్రికలు ఎక్కువగా ఉండటం ఒక కారణమైతే , కార్పోరేట్ శక్తులు , పెత్తందారుల   గుప్పెట్లో మీడియా సంస్థలు ఉండటం మరో కారణం. ఈ క్రమంలో పేదోడి గొంతుక వినిపించడానికి డాక్టర్ కటికెల శివభాగ్య రావ్ సహాసోపేపేతమైన నిర్ణయం తీసుకున్నారు. బహుజనుల గొంతుక వినిపించడానికి వేదిక గా 2007లో ప్రజాపాలన తెలుగు దినపత్రిక ను విశాఖపట్నం కేంద్రంగా ప్రారంభించారు.  అగ్రవర్ణ, కార్పోరేట్ శక్తుల తాకిడిని తట్టుకుంటూ మీడియా లో బహాజన వర్గాల ను  భాగస్వాములను చేశారు. మీ ప్రాంతంలో మీరే పత్రికాధిపతులు అంటూ అనగారిన వర్గాల లోని మేధావులను పత్రికలో భాగస్వాములను చేశారు.

* విలువలతో కూడిన సమాచారం.

ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రజా పక్షం వహించడం ప్రచార, ప్రసార మాధ్యమాల బాధ్యత నాల్గవ ఎస్టేట్ గా పేర్కొనబడుతున్న పత్రికలు ప్రజాస్వామ్య సౌధానికి మూలాధారంలో ఒకటి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి ఆచరించే విధానాల గురించి ప్రజలకు తెలియజేసేవి పత్రికలు, అదేవిధంగా ప్రభుత్వ నిర్ణయాల పట్ల ప్రజల స్పందన ప్రభుత్వానికి అందించే ముఖ్యమైన సాధనాలు కూడా పత్రికలే. కావున పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తాయి. దీనిని అక్షర సత్యం  చేసింది ప్రజాపాలన తెలుగు దినపత్రిక. 2007 లో విశాఖపట్నం లో ప్రారంభం అయిన ప్రజాపాలన ప్రజలు మద్దతు కూడగట్టుకుని 2017లో విజయవాడ, హైదరాబాద్ నగరాల్లో ఎడిషన్లు ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజల గౌరవ మన్ననలను అందుకుంటుంది.

సామాజిక వారసత్వాన్ని రానున్న తరాలవారికి అందజేయాలని స్నేహ గృప్ అధినేత, ప్రజాపాలన తెలుగు దినపత్రిక చైర్మన్ కటికెల శివభాగ్య రావ్ అన్నారు. పత్రికల ద్వారా ప్రజాస్వామ్యంలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగి సమర్థవంతమైన పరిపాలన అందించడానికి అవకాశం ఏర్పడుతుందని పేర్కొన్నారు.  అందుకే అమెరికాలాంటి ప్రజాస్వామ్య సమాజంలో పత్రికలను ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా, ప్రజాకోర్టుగా పేర్కొంటారని ఆయన గుర్తు చేశారు.
వరల్డ్​ ప్రెస్​ ఫ్రీడమ్​ఇండెక్స్​..పత్రికా స్వేచ్ఛ సూచికలో గత ఏడాది142వ స్థానంలో ఉన్న భారత్‌‌ మరింత దిగజారి150వ స్థానానికి పడిపోయిందని తెలిపిందని గుర్తుచేశారు. భారత్‌‌లో లక్షకుపైగా వార్తా పత్రికలతో పాటు 36 వేల వార పత్రికలు, 380 టీవీ న్యూస్‌‌ చానళ్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఐతే ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న తీవ్రవాదం, రాజకీయ ఒత్తిళ్ళు, కుల, మత విద్వేషాలు పెరగడం, జర్నలిస్టులపై దాడులతో పాటు పలు సంక్షోభాలు పత్రికా స్వేచ్ఛకు ఆటంకంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అధిగమించడానికి ప్రపంచస్థాయిలో ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు, ప్రభుత్వాలు పత్రికలకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందని చూసించారు.