ఇంద్రానగర్ కాలనీ నూతన అధ్యక్షుడిగా ముధ్ధం శ్రీనివాస్ యాదవ్

Published: Monday March 13, 2023
మేడిపల్లి, మార్చి12 (ప్రజాపాలన ప్రతినిధి)
చిల్కానగర్ డివిజన్  ఇంద్రానగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన కాలనీ అధ్యక్ష ఎన్నికల్లో నూతన అధ్యక్షుడుగా ముద్ధం శ్రీనివాస్ యాదవ్ (గొల్ల శీను) ఎన్నికయ్యారు. ఆయన సమీప  అభ్యర్థి మల్లేష్ పై 27 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
కాలనీ అభివృద్ధికై మేనిఫెస్టో  స్థానిక కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజును కలుపుకొని కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ముద్ధం శ్రీనివాస్ యాదవ్ 
 మేనిఫెస్టో  ద్వారా కాలనీలో
ఇంటింటికి  ప్రచారం నిర్వహించారు. 
కాలనీ ఎన్నికలకు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు  వినూత్న పద్ధతిలో సంప్రదాయ బ్యాలెట్ పేపర్ ద్వారా కాలనీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో కాలనీ మొత్తానికి 82  ఓట్లు ఉండగా 77 ఓట్లు పోల్ అవ్వగా  శ్రీనివాస్ కి 52 ఓట్లు, మల్లేష్ 24 ఓట్లు, చెల్లని ఓట్లు 1, వచ్చాయి. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు ముద్దం శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కాలనీ  ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కాలనీ అభివృద్ధి కొరకు మల్లేష్ ను కూడా కలుపుకొని   ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు రామచంద్ర రెడ్డి, జంపని బాలకృష్ణ గౌడ్, రమేష్ గౌడ్, రాజేష్ గౌడ్ ,పిల్లి సంజీవ, రఫీక్, సన్నీ, ఫణిధర్ రెడ్డి, అసిఫ్, యదయా, జంగా రెడ్డి, పాక చిన్న,మురళి కృష్ణ, రాములు, జాన్ మేస్త్రి, మహేష్ యాదవ్, శ్రీకాంత్ యాదవ్, రాజు,అశోక్, తేజ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.