ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 26వ రోజు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ
Published: Friday February 17, 2023

* జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి
వికారాబాద్ బ్యూరో 16 ఫిబ్రవరి ప్రజాపాలన : వాటర్ స్పోర్ట్స్ అకాడమీ (క్రీడ పాటశాలలో) ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ ఆద్వర్యంలో 2023-24 విద్య సంవత్సరానికి ఆశ్రమ ఉన్నత పాటశాల
బోయిన్ పల్లి నందు వాటర్ స్పోర్ట్స్ అకాడమీని ప్రారంబించడం జరిగిందని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కోటాజి ఒక ప్రకటనలో తెలిపారు. కాయకింగ్, కినోయింగ్, సెయిలింగ్ మొదలైన వాటర్ స్పోర్ట్స్ నందు గిరిజన బాల బాలికలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో 5వ తరగతి లో ప్రవేశానికి గాను విద్యార్థిని విద్యార్థులు ఎత్తు,బరువు,స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్,మెడిసిన్ బాల్ త్రో, 30మీ. ఫ్లయింగ్ స్టార్ట్, ఫ్లెక్సి బిలిటి, టెస్ట్ 800మీ. పరుగు పందెం పోటీలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా 5వ తరగతి లో ఇంగ్లీష్ మీడియం నందు 10 మంది బాలికలకు,10 బాలురకు ప్రవేశాలు కల్పిస్తారని తెలిపారు. ఈ పాఠశాలలో ప్రవేశానికి గాను ఐ టి డి ఏ మైదాన ప్రాంత జిల్లాలకు సంబంధించిన బాల బాలికలు అర్హులని తెలిపారు. ఈ వాటర్ స్పోర్ట్స్ పాఠశాలలో శిక్షణ పొందు బాల బాలికలకు ప్రత్యేకమైన ఆహరం, వసతి ,స్పోర్ట్స్ దుస్తులు, షూస్ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుంది తెలిపారు.
అసక్తి కలిగిన గిరిజన విద్యార్థులు 4వ తరగతి ఉతీర్ణులై 5వ తరగతి చదువుతున్న బాల బాలికలు రెండు (2) పాస్ పోర్ట్ సైజు పొటోలు ,బోన ఫైడ్ ,ఆదార్ కార్డ్ జీరాక్స్ సర్టిఫికేట్స్ తో ఈనెల 16 నుండి 23 వరకు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ కార్యాలయం నందు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాల్సింగా తెలిపారు.ఇతర వివరాల కొరకు ఫోన్ నం. 8464006666 ను సంప్రదించగలరని ఆయన ఆ ప్రకటన తెలిపారు

Share this on your social network: