ఉచిత శిక్షణను గిరి యువత సద్వినియోగం చేసుకోవాలి ** ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి **

Published: Thursday January 12, 2023

ఆసిఫాబాద్ జిల్లా జనవరి 11(ప్రజాపాలన, ప్రతినిధి) : పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, మెయిన్స్ పరీక్షల కొరకు గిరిజన యువతకు 3 నెలలు ఉచిత భోజనం, వసతితో కూడిన శిక్షణ అందించడం జరుగుతుందని ఐటీడీఏ పీఓ కే వరుణ్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు, ఫిజికల్, ఫిట్నెస్ (ఆర్ట్ 2) ఉత్తీర్ణులైన గిరిజన అభ్యర్థులు తమ యొక్క ఫిజికల్ టెస్ట్, అడ్మిట్ కార్డు తో పాటు, ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్లు, కుల ఆదాయ త్రు పత్రాలు, ఆధార్ కార్డు, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో కేబి కాంప్లెక్స్ యూత్ ట్రైనింగ్ సెంటర్ లో అడ్మిషన్లు చేసుకోవచ్చన్నారు. ఈ ఉచిత శిక్షణను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని, వివరాలకు 7893 616392, 9493535052, 9666748105, ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ప్రాజెక్ట్ అధికారి తెలిపారు.