పోలీస్ అభ్యర్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ** DYFI జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ ** జిల్

Published: Thursday January 12, 2023
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 11 (ప్రజాపాలన, ప్రతినిధి) :
ఎస్సై, కానిస్టేబుల్, సమస్యలను పరిష్కరించాలని చలో ప్రగతి భవన్ ముట్టడి పెడితే ముందస్తుగా అరెస్టు చేయడం సిగ్గుచేటని, ప్రగతి భవన్ ముట్టడికి వెళ్ళిన విద్యార్థి యువజన సంఘాల నాయకులు కార్యకర్తలు, కానిస్టేబుల్ అభ్యర్థులపై పోలీసులు మెడలు పట్టడం, చేతులతో గుద్ధి, శాంతియుతంగా చేసిన కార్యక్రమాన్ని ఉదృతవారణాన్ని తెచ్చి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్ అన్నారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రభుత్వం అమలు చేయకుండా పోలీసుల నియామకాలను తప్పులతడకగా నిర్వహించి, అభ్యర్థుల జీవితాలతో చెలగాటం ఆడడం సరికాదన్నారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాత పద్ధతిలో కొనసాగించి కోర్టు తీర్పును అమలు చేయాలని  కోరారు రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులను ఖండిస్తు జిల్లా  కేంద్రం లో ప్ల కార్డు లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు,ఇప్పటికైనా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచించాలని డిమాండ్ చేశారు,.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, ఎస్ఎఫ్ఐ,జిల్లా అధ్యక్షుడు సిందల్వార్, సతీష్ , SK జాఫర్,కిరణ్,తదితరులు పాల్గొన్నారు.