కోదండరాం దీక్షలో పాల్గొన్న కోరుట్ల జన సమితి నాయకులు

Published: Thursday January 12, 2023

ఇబ్రహీంపట్నం, జనవరి11( ప్రజాపాలన ప్రతినిధి ): కృష్ణానది జలాల వాటాలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టాన్ని నివారించి న్యాయం చేయాలనే ప్రధాన డిమాండ్ తో తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ప్రో:కోదండరాం గారు హైదరాబాద్ లో నేడు చేపట్టిన దీక్ష కార్యక్రమం లో కోరుట్ల నియోజకవర్గానికి చెందిన తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు విభాగాం రాష్ట్ర అధ్యక్షులు, కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జి కంతి మోహన్ రెడ్డి స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కృష్ణానదీ జలాల వాటా పంపకాల్లో మొదటి నుండి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేశారని, రాష్ట్ర  ముఖ్యమంత్రి జాతీయ పార్టీ మోజులో పడి ఢిల్లీ పాలకులపై ఒత్తిడి తేకుండా ఆంధ్ర పాలకుల అడుగులకు మడుగులు ఒత్తడం శోచనీయం అన్నారు. కృష్ణానదీ జలాల వాటాపై బారాస పార్టీ తెలంగాణ ప్రజల వైపా లేక ఆంధ్ర ప్రాంతంవైపా తెలపాలని, నేటి కోదండరాం సార్ చేస్తున్న దీక్షకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజల పక్షాన నిలబడి ఇయ్యాల కొట్లాడే ఏకైక పార్టీ తెలంగాణ జనసమితి పార్టీ మాత్రమేనని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రతిపత్తిని కాపాడుకొనుటకై ఈ నెల 30, 31 తేదీలలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి,  కృష్ణానదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని      ఎదిరించి కోదండరాం సార్ చేస్తున్న నిరంతర పోరాటానికి మేధావులు, రైతులు, విద్యార్థులు, యువజనులు మద్దతివ్వాలని కోరారు. ఇట్టి దీక్ష కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చింతకుంట శంకర్, ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు కంతి రమేష్, కళాల ప్రవీణ్, జిల్లా విద్యార్థి జనసమితి అధ్యక్షులు జిల్లపెల్లి దిలీప్, మీడియా నాయకులు తరుణ్, గంగాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.