మోడల్ స్కూల్లో ఎస్ ఎం సి అధ్వర్యంలో ముగ్గుల పోటీలు విజేతలకు బహుమతి ప్రధానం

Published: Thursday January 12, 2023

కొడిమ్యాల, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి):
కొడిమ్యాల మండలంలో ప్రభుత్వ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విద్యార్థిని విద్యార్థులకు ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థినిలు తో పాటు ముగ్గుల పోటీలో పాల్గొనడం జరిగింది. అనంతరం విజేతలను ఎంపిక చేసి బహుమతి ప్రధానం ఎస్ఎంసి చైర్మన్  ఎర్రోజు శ్రీనివాసచారి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ చేతుల మీదుగా బహుమతి ప్రధానం జరిగింది. ముగ్గుల పోటీలకు ఆర్థిక సహకారాన్ని గ్రామ మాజీ వార్డ్ మెంబర్ రాచకొండ చంద్రమోహన్ గోల్కొండ రాజు అందజేశారు కార్యక్రమంలో మోడల్ స్కూల్ ఉపాధ్యాయ బృందం మోహన్ సార్ రజని మేడం అంజలి, సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.