మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ *12గంటలు నిరాహారదీక్ష

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కొవ్వూరు పట్టణం నందు గల మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ *12గంటలు నిరాహారదీక్ష లో పాల్గొంటారు . కావున పార్టీ శ్రేణులు ప్రజలు అందరూ కూడా ప్రభుత్వం నిర్దేశించిన lack down నిబంధనలు పాటించే ఎవరికి వారు వారి స్వగృహం నందు ఉండాలని ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పట్టణం నందు high risk redjone లో తన నివాసానికి రావొద్దని వారు పత్రికాముఖంగా తెలియజేశారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇబ్బంది పడుచున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి.ధాన్యం , మిర్చి, అరటి పండ్లతోటల రైతులను ఆదుకోవాలని జవహర్ తెలిపారు.కరోనా నియంత్రణ కోసం పోరాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, అధికారులు, పాత్రికేయులకు రక్షణ కిట్లు దించాలని,అన్న క్యాంటీన్లను వెంటనే తెరచి పేద వాడి ఆకలిని తీర్చాలని మేము దీక్ష చేస్తున్నామని జవహర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు పేదలను రైతులను ను ప్రభుత్వం ఆదుకోవాలని మన మాజీ మినిస్టర్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ గారు 12 గంటలు నిరాహార దీక్ష చేస్తున్నారని తెలియజేస్తున్నాము . కరోనా వైరస్ కారణంగా కొవ్వూరు రెడ్ జోన్గా ఉన్నందువల్ల ఈ నిరాహార దీక్షకు మద్దతుగా తెలుగుదేశ పార్టీ శ్రేణులు ఎవరూ కూడా హాజరు కాకూడదని జవహర్ తెలిపారు.

Share this on your social network: