చాగల్లు లో మాజీ మంత్రి జవహర్ పరామర్శ

Published: Saturday October 26, 2019
రాష్ట్ర తెలుగుదేశం పార్టీl నాయకులు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి శామ్యూల్ గారు గారు చాగల్లు మండలం లో పర్యటించివివిధ కుటుంబాలను పరామర్శించారు.ఇటీవల బస్సు ప్రమాదంలో గాయాలు పాలైన కోడూరి రాయుడు నీ మల్లవరం గ్రామంలో పరామర్శించి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.చాగల్లు గ్రామంలో పార్టీ మైనారిటీ నాయకులు అల్తాఫ్ గారి కుటుంబాన్ని పరామర్శించారు.నెలటూర్ గ్రామం లో మేడా ప్రసాద్ గారి అమ్మమ్మ మలకపల్లి వరలక్ష్మి గారుఇటీవల కాలం చేసిన వారి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ పర్యటనలోజిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కరుటూరి సతీష్ .కోడూరి ప్రసాద్. నందమూరి భద్రం. చాగల్లు మండల పార్టీ అధ్యక్షులు బొడ్డు రాజు.జిల్లా తెలుగుదేశం పార్టీ యువ నాయకులుమద్దుకూరి ప్రసాద్.మల్లవరం కాశి.చాగల్లు మండల కాపు సంఘం అధ్యక్షులు మేక ప్రసాద్.తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ బీసీ నాయకులు నాయకులు కోడి చంటియ.షేక్ బాషా.తదితరులు పాల్గొన్నారు. పరామర్శల అనంతరం కరుటూరి సతీష్ గారి ఇంటి వద్ద జరిగిన పత్రికా సమావేశంలో జవహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కార్మికులు దాని అనుబంధ రంగాల కార్మికులు పడుతున్నవెతలను బహిరంగ పరిచే కార్యక్రమాన్నివిజయ వంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులకు సహకరించిన ప్రజలకు ధన్యవాదములు.ఇసుక కృత్రిమ కొరత తీరి ప్రజలకు అందుబాటులో వచ్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని జవహర్ తెలియజేశారు.ఇసుక ఆధారిత కార్మికులకు భవన నిర్మాణ రంగ కార్మికులకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని వారి కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.