టి డి పి, వై ఎస్ ఆర్ పార్టీలలో గ్రూపుల సమస్య

Published: Saturday December 29, 2018
  • కొవ్వూరునియోజకవర్గంలో 2018 రాజకీయా నేతలకు మిశ్రమ ఫలితాలనే ఇచ్చిందనే చెప్పవచు.  మంత్రి కే ఎస్ జవహర్ కి ఎదురే లేదు అనుకున్న సమయంలో ప్రత్యర్థి వర్గం తయారైనది. చిన్న చిన్న కారణాలతో వర్గపోరు పెరిగిందనే చెప్పవచ్చు .1983 తెలుగు దేశం పార్టీ పెటినతరువాత కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ లో  అసమ్మతి గ్రూపు అనేది ఇదే కావచ్చు. కృష్ణ బాబు టైములో పార్టీ లో గ్రూపులు లేవు . టి.వి రామారావు టైములో ఏర్పడిన గ్రూపులు మున్సిపల్ ఎన్నికలలో , అసంబ్లీ ఎన్నికలలో కల్సిపనిచేచి విజయం సాధించాయి . గత 6 నెలలుగా గ్రూపులు మధ్య విభేదాలు పెరిగాయి . అంతర్గతంగా ఉన్న గ్రూపులు కార్తీక వనభోజనాలతో బహిర్గతం అయ్యాయి . మంత్రి వర్గం మంత్రి వ్యతిరేక వర్గంగా ఎవరి పని వారు చేసుకుంటున్నారు . వచ్చే ఎన్నికలలో కొవ్వూరు తెలుగు దేశం పార్టీ సీటు ఆశిస్తున్నా వారు మంత్రి వ్యతిరేక వర్గంను ఆశ్రయిస్తున్నారు . ఈ జాబితాలో టి.వి రామారావు ముందువరసలో ఉన్నారు. అయితే మంత్రి వర్గం ప్రత్యర్థి వర్గం ను  పట్టిచుకోకుండా పార్టీ వ్యవహారాలలో , ప్రభుత్వ కార్యక్రమాలతో ముందుకుపోతున్నారు . ప్రత్యర్థి వర్గం ఎంత కవ్వించినా మంత్రి మౌనం వెనుక పరమార్ధం ఏమిటో అంతుపట్టకుండా ఉందనేది రాజకీయ వర్గాల విశ్లేషణ.
  • వై ఎస్ ఆర్ పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీలో కూడా విభేదాలు బహిర్గతమే. పార్టీ నియాజకవర్గ సమన్వయ కర్త తానేటి వనితకు పట్టణంలో నాయకుడు పరిమి హరి చరణ్ కు మధ్య విబేధాలు ఉన్నాయి. మండలంలో కూడా పలువురు నాయకులతో ఉన్న విభేదాలు పార్టీలో గందగోళంగా ఉందనే చెప్పవచ్చు . జన సేన పార్టీ  నియోజకవర్గంలో చాపకింద నీరులా విస్తరిస్తుందని చెప్పవచ్చు. నాయకులు అంతంత మాత్రంగా ఉన్నా పార్టీని కార్యకర్తలు ముందుకు తీసుకువెళుతున్నారు. నాయకత్వ సమస్య లేకపోతే  జన సేన నియోజకవర్గంలో బలమైన పార్టీ అని చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ  భలం నియోజకవర్గంలో నామమాత్రమే . ఈ పార్టీకి  నియోజకవర్గంలో నాయకులు ఎక్కువ కార్యకర్తలు తక్కువ. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి    నియోజకవర్గంలో మనుగడ కష్టం . నియోజకవర్గంలో 4 పార్టీలు ఉన్న టి డి పి, వై ఎస్ ఆర్, జనసేన పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. టి డి పి, వై ఎస్ ఆర్ పార్టీల మాదిరి నియోజకవర్గంలో రాజకీయం చేస్తే జనసేన పార్టీ విజయం సాధించినా ఆశ్చర్యం లేదు.నియోజకవర్గంలో 4 పార్టీలు మధ్య ఏ పార్టీ అయినా కనీసం 50 వేలకు పైగా ఓట్లు సాధిస్తే విజయం సాధించవచ్చు. కొత్తగా ఏర్పడిన జనసేనలో, మనుగడ కష్టంగా ఉన్న భారతీయ జనతా పార్టీలో గ్రూపుల సమస్య లేదు.నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న టి డి పి, వై ఎస్ ఆర్ పార్టీలలో గ్రూపుల సమస్య ఉంది.