బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

Published: Wednesday April 07, 2021
సారంగాపూర్, ఏప్రిల్ 06 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండలంలోని భారతీయ జనత పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ సారంగాపూర్ మండల అధ్యక్షుడు ఎండబెట్ల వరుణ్ కుమార్ పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ విధివిధానాలను కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షుడు గొల్లపెళ్లి తిరుపతి ఉస్కెల మహేందర్  కొండ మురళి బిజెవైఎం మండల్ అధ్యక్షుడు దీటి వెంకటేష్ శనిగరపు తిరుపతి పాల్గొన్నారు.