వై ఎస్ ఆర్ పార్టీలో గ్రూపుల మధ్య సమన్వయం వనితకు కత్తిమీద సామే

Published: Wednesday December 19, 2018

కొవ్వూరునియోజకవర్గంలో వై ఎస్ ఆర్ పార్టీ నాయకురాలు తానేటి వనిత ఒంటెద్దు పోకడ విధానంతో పార్టీలో ఒక వర్గానికి చెందిన నాయకులు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. కొవ్వూరు పట్టణానికి చెందిన పరిమి హరి చరణ్, మండలానికి  చెందిన ముదునూరి నాగరాజు, ముప్పిడి విజయరావు, బండి పట్టాభిరామారావులు ఇప్పటికే వనితకు వ్యతిరేక వర్గాన్ని పార్టీలో తయారుచేస్తున్నారు . నాయకుల పట్ల వనిత నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని వీరు ఆరోపిస్తున్నారు , దీనికి తోడు   వై ఎస్ ఆర్ పార్టీలో సీనియర్ నాయకుడైన పంగిడి గ్రామానికి చేందిన పి.కె రంగారావును  ఏకపక్షంగా  పార్టీ నుడి సస్పెండ్ చేయించినట్లు వనితపై ఆరోపణలు ఉన్నాయి.  కొవ్వూరు పట్టణం మరియు మండలంలో నాయకుల తీరుతో చిరాకులతో ఉన్న పార్టీకి గోరుచుటుపై రోకలి పొట్టులా చాగల్లులో వనితకు వ్యతిరేకంగా  మరొక వర్గం తయారైనట్లు తెలుస్తుంది. చాగల్లు లోని ఒక వర్గానికి చెందిన పలువురు నాయకులు ఇటీవల రహస్యంగా సమావేశం నిర్వహించి వనిత  అనుచరిస్తున్న విధానం, గ్రామాలలో తమకు ప్రత్యామ్నాయంగా కొత్త గ్రూపులను తయారుచేయడం వంటి విషయాలపై సుదీర్ఘముగా చర్చించినట్లు పార్టీ వర్గాలు ద్వారా తెలిచింది.కొవ్వూరునియోజకవర్గంలో వై ఎస్ ఆర్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉండగా వర్గపోరుతో పార్టీ పరిస్థితి మరింత దిగజారిందని చెప్పవచ్చును. వనితకు పెద్ద దిక్కుగా కొవ్వూరు మాజీ మున్సిపల్ చైర్మన్ కోడూరి శివరామ కృష్ణ ఉండగా, మండలంలో కాకర్ల నారాయుడు, యండపల్లి రమేష్ బాబులు వెన్ను దన్నుగా ఉన్నారు. ఈ గ్రూపుల మధ్య పార్టీ ఒడిదుడుకులను ఎదుర్కొంటుందని చెప్పవచు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఈ గ్రూపుల మధ్య సమన్వయము సాధించి ముందుకు వెళ్లడం వనితకు కత్తిమీద సామే అవుతుందనడంలో సందేహం లేదు.