మధిర టీబీ యూనిట్ కి బెస్ట్ అవార్డ్స్

Published: Thursday March 25, 2021
మధిర మార్చి 25 ప్రజాపాలన ప్రతినిధి ఈ రోజు ప్రపంచ క్షయవ్యాది దినోత్సవం సందర్బంగా మధిర టీబీ యూనిట్ బృందానికి ఖమ్మంజిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలొ జిల్లా టీబీ నివారణ సంస్థ ద్వారా ఖమ్మం DMHO ఛాంబర్ లో బెస్ట్ టీబీయూనిట్ మెడికల్ ఆఫీసర్ గా dr వెంకటేష్ phc మాటూరుపేట, మధిర మండల్ బెస్ట్ టీబీ నోడల్ పర్సన్ గా లంకా కొండయ్య,మధిర టీబీ యూనిట్ బెస్ట్ LT గా Lt అనురాధ, బెస్ట్ ల్యాబ్ సూపర్ వైజర్ గా శివ, బెస్ట్ ఆశగా ఇరుగు యశోధకి Dmho dr మాలతీ, Dtco dr వరికూటి సుబ్బారావు చేతులు మీదగా షీల్డ్, ప్రశంస పత్రాలు అందు కున్నారు. టీబీ రహిత సమాజం కోసం కృషి చేస్తున్న మధిర టీబీ బృందంకు పలువురు మధిర ప్రాంత ప్రజలు అభినందనలు తెలియ జేశారు. అదే విధంగా టీబీ వ్యాదిపై "నేషనల్ లెవెల్ కళాజాతా" ద్వారా ఖమ్మం జిల్లాకు గుర్తింపు తెచ్చిన కొండయ్య బృందంను జిల్లా వైద్యాధికారిణితో పాటు జిల్లా ప్రోగ్రాం అధికారులు phc వైద్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.