- సరసమైన ధరలకే లిక్కర్
- మందుబాబులకు కిక్కే కిక్కు
- ఏపీలో నూతన మద్యం పాలసీ
- గీత కార్మికులకు 10 శాతం దుకాణాలు
- వరద బాధితులకు ఆర్థిక సాయం
- మహిళలకు ఉచిత ప్రయాణంపైనా పరిశీలన
- నిర్ణయించిన ఏపీ కేబినెట్
ముద్ర, తెలంగాణ బ్యూరో :ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన మద్యం విధానంలో, సరసమైన ధరలకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించారు. అలాగే గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించాలని ప్రతిపాదించినట్లు. నూతన మద్యం పాలసీ, వరద బాధితులకు సాయంతో పాటు ఇతర ఏపీ సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్ బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
మద్యం ధరలు తగ్గింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు శుభవార్త అందించింది. మళ్లీ పాత విధానంలోనే మద్యం దుకాణాల్లో లిక్కర్ విక్రయాలు నిర్వహించబడ్డాయి. 2019 కంటే ముందున్న మద్యం విధానాన్నే తిరిగి ప్రవేశపెట్టింది. ఈవిధానంలో మద్యం రిటైల్ వ్యాపారం మొత్తం ప్రైవేట్‌కే అప్పగించబడుతుంది. ఏపీ వ్యాప్తంగా 3396 వైన్ షాపులు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన గీత కార్మికులకు పది శాతం దుకాణాలు కేటాయించబడతాయి. అంటే మరో 396 పదార్థాలను అదనంగా నోటిఫై చేయనున్నారు. ఇక, మద్యం ధరలను కనీసం రూ. 100 నుండి ప్రారంభించాలని నిర్ణయించారు. వైఎస్సార్‌సీపీ హయాంలో విక్రయించిన నాసిరకం మద్యంతో ఐదేళ్లలోనే 56,000 మంది కిడ్నీ, లివర్ సంబంధిత సమస్యల బారిన పడ్డారని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు. నాసిరకం మద్యం తాగి అనేకమంది చనిపోయారని . అక్రమ మద్యం విక్రయాల ద్వారా జగన్ రూ.19,000ల కోట్లు దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యానికి బానిసలైన వారిని కౌన్సెలింగ్ కేంద్రాలకు తరలించి కొంత నిధులు కేటాయించాలని ప్రతిపాదన చికిత్సలు పెట్టినట్లు వైద్యులు తెలిపారు.
మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదనలు
అక్టోబర్ 4,5 తేదీల్లో కొత్త మద్యం విధానం అమల్లోకి రాన ప్లాస్టిక్ కోసం దరఖాస్తులు కోరుతున్నారు. లాటరీ ద్వారా లైసెన్స్‌లు కేటాయించబడతాయి. ఈ విధానం రూపకల్పన కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కొండపల్లి శ్రీనివాస్, సత్యకుమార్ యాదవ్, గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలో సమావేశమైన ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అనంతరం సీఎం చంద్రబాబుకు నివేదించగా ఆయన కొన్ని మార్పులు చేర్పులు చేశారు. నేడు జరగనున్న కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలు పెట్టనున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం విక్రయాలను ప్రభుత్వమే చేపట్టేందుకు ఎక్సైజ్ చట్టాన్ని సవరించారు. ఇప్పుడు మళ్లీ ప్రైవేట్ వ్యక్తులకే మద్యం దుకాణాలు అప్పగించడానికి మళ్లీ చట్ట సవరణ అవసరం. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేనందున ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో నూతన మద్యం విధానం ఖరారు చేసే అవకాశం ఉంది. అదే రోజు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
కొత్తగా ప్రీమియం దుకాణాలు
అక్టోబర్ 4, 5 తేదీల నాటికి కొత్త మద్యం విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్తగా ప్రీమియం స్టోర్లనూ ప్రవేశపెట్టాలని సర్కార్ ఆలోచిస్తోంది. అయితే ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి హాని తలపెట్టని బ్రాండ్‌లను మాత్రమే అందుబాటులోకి తెస్తామని, నాణ్యమైన మద్యం ధరలో కొత్త విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సరసమైన ధరలకే నూతన మద్యం విధానాన్ని అందిస్తున్నట్లు, కొత్త మద్యం విధానంపై పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేశామన్నారు. తక్కువ ధరలకు నాణ్యమైన మద్యం విక్రయించాలని నిర్ణయించామని, గతంలో అక్రమ మద్యం విధానంతో డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యామని. మత్తుకు బానిసలైన వారిని రక్షించేలా కొన్ని చర్యలకు నిధులు కేటాయించారు మంత్రి కొల్లు రవీంద్ర.
వరద బాధితులకు అండగా
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలు నీటమునిగాయి. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. వరద బాధితులకు నష్టపరిహారం ప్రస్తుతం వరద ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం లభించింది. విజయవాడ వరదల్లో మునిగిపోయి, ఫస్ట్ ఫ్లోర్ ఆ పైన ఉన్న ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించడంతో నిన్న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ కాకుండా, వరదల వల్ల ఇతర ప్రాంతాల్లో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇస్తాం. గతంలో కేవలం రూ.2 వేలు ఇచ్చేవారు, ఇప్పుడు దాన్ని రూ.10 వేలకు పెంచుతున్నామని సీఎం ప్రకటించారు. హెక్టార్ వరికి రూ.25 వేలు, ఎకరాకు రూ.10 వేలు సాయం. హెక్టార్ పత్తికి రూ.25 వేలు, వేరుశనగకు రూ.25 వేలు సాయం. హెక్టార్ చెరకు రూ.25 వేలు, హెక్టార్ పొగాకుకు రూ.15 వేలు. హెక్టార్ మొక్కజొన్న, రాగికి రూ.15 వేలు, హెక్టార్ సోయాబీన్, పొద్దుతిరుగుడు, పొగాకుకు రూ.15 వేలు అందించారు. ఈ నిర్ణయానికి నేడు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇంకా.. పంట నష్ట పరిహారం కౌలు రైతులకే అందించడానికి కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ కేబినెట్ తీర్మానం చేసింది.
సాక్షి పైనా..!
గత ప్రభుత్వం పత్రిక కొనుగోళ్లలో చేసిన అవకతవకలపై కెబినెట్‌లో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. రెండేళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 205 కోట్లు ఖర్చు చేశారు మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సీఎం దృష్టికి తెచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు ఆదేశిస్తామని సీఎం చంద్రబాబు మంత్రులకు తెలిపారు. సాక్షి పత్రిక సర్కులేషన్ ఎంత?, ఏ నిబంధనల ప్రకారం సాక్షి పత్రిక కొనుగోళ్లకు నిధులు కేటాయించారనే దానిపై ఎంక్వైరీ వేయాలని పలువురు మంత్రులు సీఎం కోరినట్లు సమాచారం.
మహిళలకు సీఎం కానుక
వచ్చే దీపావళి నాటికి మహిళలకు కానుక ఇవ్వాలనే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఉచిత వంట గ్యాస్ అందిద్దామా..? లేక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిద్దామా? అనే అంశంపై మంత్రుల అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు తీసుకున్నారు. ఏడాదికి మూడు ఉచిత వంట గ్యాస్ సిలిండర్లను ఇచ్చే పథకం వైపే మెజార్టీ మంత్రుల మొగ్గు చూపినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి
గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీడీపీ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పేరును ప్రకటించారు.