Home ఆంధ్రప్రదేశ్ ఏపీకి పొంచివున్న వాయుగుండం ముప్పు.. ఈ నెల 26న వర్షాలు – Prajapalana News

ఏపీకి పొంచివున్న వాయుగుండం ముప్పు.. ఈ నెల 26న వర్షాలు – Prajapalana News

by Prajapalana
0 comments
ఏపీకి పొంచివున్న వాయుగుండం ముప్పు.. ఈ నెల 26న వర్షాలు


దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత రెండు రోజుల్లో అల్పపీడనం వాయుగుండంగా బలపడుతుందని నిపుణులు అంచనా వేశారు. అల్పపీడనం తుపానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఈ నెల 27న తమిళనాడు లేదా ఏపీలో తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీని ప్రభావంతో వచ్చే మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఉంది.

రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం పెరిగింది. సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలో నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా వైద్య విభాగాలు, శివారు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 8 గంటల వరకు మంచు కురుస్తూ ఉండటంతో అనేక ప్రాంతాల్లో వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు మంచు అధికంగా కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

దండకారణ్యంలో మరో ఎన్‌కౌంటర్‌.. పది మంది మావోయిస్టులు హతం
పరగడుపున ఈ పండ్లను అస్సలు తినొద్దు

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech