Home సినిమా కన్నీళ్లు పెట్టుకున్న సూర్య.. ఓ హీరోయిన్ అంటే ఇష్టం! – Prajapalana News

కన్నీళ్లు పెట్టుకున్న సూర్య.. ఓ హీరోయిన్ అంటే ఇష్టం! – Prajapalana News

by Prajapalana
0 comments
కన్నీళ్లు పెట్టుకున్న సూర్య.. ఓ హీరోయిన్ అంటే ఇష్టం!


ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న నటసింహం నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ టాక్ షో మంచి రేటింగ్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ టాక్ షో 3 సీజన్స్ పూర్తి చేసి సీజన్ 4 లోకి వచ్చింది. ఇక ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ ప్రోమో రీలీజ్ అయ్యింది. ఇందులో కంగువ మూవీ టీమ్ వచ్చింది. ఈ ప్రోమోలో హీరో సూర్యతో బాలకృష్ణ సందడి చేశారు.

“నేను సింహం అయితే అతను సింగం, నేను లెజెండ్ అయితే అతను గజినీ, నేను అఖండ అయితే అతను రోలెక్స్” అంటూ సూర్యని ఇంట్రడ్యూస్ చేస్తూ అదిరిపోయే ఇంట్రో బాలయ్య. ఇక సూర్యతో సరదా కబుర్లు, తికమక ప్రశ్నలు వేసి ఎంటర్టైన్ చేశారు. ప్రశ్న అడిగారు .ఇక బాలయ్య ఊరుకోకుండా వెంటనే కార్తీకి ఫోన్ చేసి “మీ అన్నయ్య చాలా అబద్దాలు ఆడారు” అని చెప్పగానే “ఆయన చిన్నప్పటి నుంచి అంతే సార్” అని కార్తీ అంటే “నువ్వు కార్తీ కాదు రా.. కత్తి” అని డైలాగ్ వేశారు.

వీటితో పాటు సూర్య చేస్తున్న సమాజ సేవకు సంబంధించిన ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. సూర్య ఓ అమ్మాయికి సాయం చేసినప్పుడు ఆమె చెప్పిన మాటలను వీడియో రూపంలో చూపించారు బాలయ్య. ఆ అమ్మాయి మాటలు విన్న సూర్య సెట్ లోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. తాను చేస్తున్న సేవకు అటు తమిళనాడు నుంచి ఇటు ఆంధ్రా నుంచి కూడా చాలా మంది ఫండ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారని సూర్య చెప్పారు. ఇక ఫైనల్ గా ప్రోమో ఎండింగ్ లో కంగువ డైరెక్టర్ శివ, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ షోలో ఎంట్రీ ఇచ్చారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech