- బస్సు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, ప్రజలు ఇక్కట్లు
- రహదారి సౌకర్యం ఉన్న పట్టించుకోని సర్కార్
- నేర్మట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించినట్టే కల్పించి బస్సును బంద్ చేశారు
- గతంలో నేర్మట కు వచ్చే బస్సును ప్రారంభించాలి
చండూరు, ముద్ర:పల్లెలో నివసించే ప్రజల రక్ష కోసం పల్లె వెలుగు బస్సులు నడిచేవి. రాష్ట్ర ప్రభుత్వం పల్లె వెలుగు పేరుతో ఆర్టీసీ బస్సులను పల్లెల్లో ప్రవేశపెట్టింది. కానీ ఇవి ఇప్పుడు కనిపించడం లేదు. కేవలం పట్టణాలకు పరిమితం కావడంతో పల్లెల్లో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ప్రజలు, విద్యార్ధులు ఆవేదన చెందుతున్నారు.
చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామాలవిద్యార్థులకు, ప్రజలకు ఉదయం ఏడు గంటలకు నల్లగొండ కు పోవడానికి బస్సు సౌకర్యం ఉండేది. కానీ అనివార్య కారణాల వల్ల మా గ్రామానికి వచ్చే ఆర్టీసీ బస్సును బంద్ చేశారు. సుమారు రెండు నెలలు ఉండి ఈ బస్సును బంద్ చేయడం జరిగింది. ఉదయం 8 గంటలకు నేర్మట గ్రామం నుండి చౌటుప్పల్ కు, చౌటుప్పల్ నుండి సాయంత్రం 6 గంటలకు మా గ్రామం నుండి నల్లగొండకు నడిపిస్తున్నారు. గతంలో ఆర్టీసీ అధికారులకు సిపిఎం ఆధ్వర్యంలో ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం వలన ఆర్టీసీ అధికారులు ఉదయం ఏడు గంటలకు నల్లగొండకు పోయేది. కానీ ఆ మాత్రం ఎందుకు బందు చేశారో అర్థం కావడం లేదు. చండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యం లేని గ్రామాలను పరిశీలించి పల్లె వెలుగు బస్సులు ఆ విధంగా కృషి చేశారు ప్రజలు, విద్యార్థులు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం పూర్తి స్థాయిలో అందేలా చూడాలని చండూరు మండల ప్రజలు కోరుతున్నారు. గతంలో నల్లగొండ డిపో నుండి సాయంత్రం ఐదు గంటలకు బయలుదేరి కనగల్, చండూరు, నేర్మటు మీదుగా శివన్న గూడెం, మర్రిగూడెం, మాల్ కు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉండేది. మళ్లీ మాల్ నుండి ఉదయం ఐదు గంటల 30 నిమిషాలకు బయలుదేరి మర్రిగూడెం, శివన్న గూడెం, దోని పాముల, నేర్మటకు ఉదయం ఏడు గంటలకు వచ్చి చండూరు, కనగల్, నల్లగొండకు బస్సు సౌకర్యం ఉండేది. గతంలో ఉదయం సమయాన నెర్మట నుండి నల్లగొండకు ఆర్టిసి బస్సు పోవడం వలన ఎంతోమంది విద్యార్థులకు , ప్రజలకు అనుకూలంగా ఉండేది. కానీ ఆర్టీసీ అధికారులు బస్సును బంద్ చేశారు. మా నేర్మ ట గ్రామంలో వచ్చే బస్సును బంద్ చేసి, ఇంకా మిగిలిన గ్రామాలలో బస్సు సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నేటికీమారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం లేక పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు సమయానికి రాలేక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల పరిధిలోని జోగిగూడెం, తిమ్మారెడ్డి గూడెం, నేర్మట, గొల్లగూడెం, తాస్కాని గూడెం, బోడంగి పర్తి, గుండ్రపల్లి, చామలపల్లి, శిర్ధపల్లి, మెండు వారి గూడెం, కస్తాల, ఈ గ్రామాలకు బస్సు సౌకర్యంలేకప్రజలు, విద్యార్థు లుతీవ్ర బస్సు ఇబ్బందులు పడుతున్నారు. వెళ్లాలంటే బిక్కుబిక్కుమంటూ ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోలేని గ్రామాలకుబస్సును ఏర్పాటు చేశారు.