లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అవుతారు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ప్రతిపక్ష హోదాలో తొలిసారి అసెంబ్లీకి హాజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తెలంగాణలో డిసెంబర్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాలేదు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు మంగళవారం( జులై 23) నుంచి ప్రారంభం కానున్నాయి.
కాగా, మంగళవారం మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణభవన్లో బీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇప్పటికి మొత్తం 10 మంది బీఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారిన నేపథ్యంలో కేసీఆర్ బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.