39
తమిళనాడులో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్ కుప్పకూలింది. తిరుపత్తూరు జిల్లాలో అంబూర్ బస్టాండ్ దగ్గర ఈ ఘటన జరిగింది. ప్లైవర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అక్కడ పనిచేస్తున్న వందలాది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు.వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించి శిథిలాలను తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు 12 మంది కార్మికులను సురక్షితంగా కాపాడారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు సాగిస్తున్నారు.జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అంబూరు నగర పరిధిలో హైలెవల్ ఓ ప్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది.