4
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఐదేళ్ల బాలుడిపై ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారు. మరికొందరు ఈ ఘటనను వీడియో తీశారు. హర్పూర్ జిల్లాలో ఈ నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలుడి ఆరోగ్యం క్షీణిస్తుండడం, శరీరంపై గాయాలు ఉండటంతో ఈ నెల 26న కుటుంబ సభ్యులు ప్రశ్నించడంతో జరిగిన దారుణ ఘటనను బాలుడు వివరించాడు. దీంతో కుమారుడితో కలిసి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అర్ష్, జునైద్ అనే వ్యక్తులు బాలుడిని ఇంటి నుంచి సమీపంలోని పొలానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అదే సమయంలో అక్కడున్న మేకలకాపరులు రిజర్వాన్, అల్ఫెజ్ ఈ ఘటనను వీడియో తీసి ఇంటర్నెట్లో షేర్ చేశారు. విషయం తెలిసి నిందితులను ప్రశ్నించేందుకు వెళ్లిన బాలుడి కుటుంబ సభ్యులపై నిందితులు దాడి చేశారు. చంపేస్తామని బెదిరించారు. పోక్సో సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసుల బృందాలు గాలిస్తున్నాయి. త్వరలోనే వారిని అరెస్ట్ చేశారు పోలీసులు.