10
ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి చెందిన హైకోర్టుకు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను రేవంత్ రెడ్డి ప్రభావితం చేస్తారనే ఆరోపణలు తప్ప ఆధారాలు లేవన్న సుప్రీం.. ఈ దశలో జగదీశ్ రెడ్డి పిటిషన్ ను ఎంటర్ టైన్ చేయమని తేల్చి చెప్పింది. కేసు విచారణలో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోలేదు. అలాగే ఈ కేసులకు సంబంధించిన వివరాలను రేవంత్ కు రిపోర్ట్ చేయవద్దని సుప్రీం ధర్మాసనం ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది.