6
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 48 మంది మృతి చెందారు. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్ డీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. నార్త్ సెంట్రల్ నైగర్ స్టేట్ లోని అగరు ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.ఈ ఏడాదిలో అక్కడ జరిగిన ఘటనల్లో ఇదే అతిపెద్దది.