10
అల్పపీడనం ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎగువ రైల్వే ట్రాక్ లపై వరద నీరు చేరడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. ఇలా ఎక్కడాఇక్కడే వాహనాలు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో విజయవాడ డివిజన్ పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి.. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన.. భద్రతా కారణాల రీత్యా పలు రైళ్లను రద్దు చేసింది. ఆదివారం, సోమవారం దాదాపు 30 వరకు రైళ్లు రద్దయ్యాయి. రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. విజయవాడ-కాజీపేట మార్గంలో 24 రైళ్లు నిలిపివేసింది.. సింహాద్రి, మచిలీపట్నం, గంగా-కావేరి, సంఘమిత్ర, గౌతమి, చార్మినార్, యశ్వంత్పూర్ రైళ్లు నిలిపివేశారు..