4
- శంషాబాద్ విమానాశ్రయంలో కలిసిన సీఎం, సీఈఎస్, డీజీపీ, త్రివిధ దళాల అధికారులు
ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర నూతన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు సీఎం రేవంత్ రెడ్డి వెల్ కం చెప్పారు. బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, త్రివిధ దళాల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార వేణుగోపాల్ రావు, ఇతర వ్యక్తులు కొత్త గవర్నర్కు స్వాగతం పలికారు. కాగా జిష్ణుదేవ్ వర్మ ఇంకాసేపట్లో రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.