10
ముద్ర,జమ్మికుంట:- కొద్దిరోజుల క్రితం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఐన తక్కళ్లపల్లి రాజేశ్వరరావు, ఎర్రంరాజు సురేందర్ రాజులు కెనాల్ కాంట్రాక్ట్ వర్క్‌లో పార్ట్నర్గా చేర్చుకుంటామని చెప్పి రూ.82 లక్షలు తీసుకుని ఎలాంటి పని అప్పగించకుండా తిప్పుకుంటుండడంతో డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఆబాది జమ్మికుంట నివాసం ఉంటున్న బాసని పాపిరెడ్డి స్థానిక కోర్టులో ఫిర్యాదు చేయగా శనివారం రోజు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని సీఐ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.