0
- సూసైడ్ నోట్ రాసి వ్యక్తి అదృశ్యం
- నా భర్తను కాపాడండి
ముద్ర,హన్మకొండ : నా చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మంగళవారం రాత్రి హన్మకొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తనని కొట్టారని, తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని శ్యాంరావు ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
తన దగ్గర అప్పు తీసుకున్న వారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరపకుండానే తనను కొట్టారని ఆరోపించిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. అదృశ్యమైన నా భర్తను కాపాడాలని భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా నా భర్తను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసింది.