సమంతపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈ మేరకు సమంతను ట్యాగ్ చేస్తూ మంత్రి కొండా సురేఖ ఎక్స్‌లో పోస్టు చేశారు. నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఓ నాయకుడి చిన్నప్పుడు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలు దెబ్బతీయాలని కాదు.. స్వయంశక్తితో మీరు ఎదిగిన తీరు నాకు ఆదర్శం.. మీరు మనస్తాపానికి గురైతే నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా అంటూ మంత్రి కొండా సు సమంతను ట్యాగ్ చేశారు.
నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో భారీ చర్చకు దారితీశాయి. ఆమె వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, సమంత, నాగార్జున కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆమె తన మాటలను వెనక్కి తీసుకున్నారు.