22
- హరిత ' ఆ ' హారం
- ట్రిగార్డులు లేక కనుమరుగవుతున్న మొక్కలు
భూదాన్ పోచంపల్లి, ముద్ర:- హరితహారం మొక్కలు అధికారుల నిర్లక్ష్యం కారణంగా జీవాల పాలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా భూదాన్ పోచంపల్లి పట్టణంలోని ప్రధాన రహదారి మధ్యలో గల డివైడర్‌లో నాటిన మొక్కలకు ట్రీ గార్డ్స్ లేకపోవడంతో మేకలకు ఆహారంగా మారుతోంది. మొక్కలు నాటిన అధికారులు వాటిని పర్యవేక్షించడంలో పూర్తిగా విఫలమయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి మొక్కలకు ట్రీ గార్డులను ఏర్పాటు చేసి మొక్కలను పరిరక్షించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.