hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortefesbetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingholiganbetholiganbet girişSoft2betizmir escortSolana Trading Botgrandpashabettosple.comGrandpashabetGrandpashabetjojobetholiganbet girişdeneme bonusu veren sitelerzbahiszbahisbetsatsonbahisperabetsekabet466 marsbahispadişahbetpadişahbet girişpadişahbetalobet girişmatadorbetSweet Bonanzasahabettez yazdırmaextrabet girişgiftcardmall/mygiftimajbetbetcio girişantalya escortmeritbetポルノを見るimajbetkolaybetolabahis
Home సినిమా 'రుద్ర గరుడ పురాణం ' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది : సోహైల్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

'రుద్ర గరుడ పురాణం ' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది : సోహైల్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
'రుద్ర గరుడ పురాణం ' తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది : సోహైల్ - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



రిషి, ప్రియాంక కుమార్ జంటగా కేఎస్ నందీష్ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'రుద్ర గరుడ పురాణం'. అశ్విని ఆర్ట్స్ బ్యానర్‌పై అశ్విన్ విజయ్ లోహిత్ ఈ కష్టాలు తీర్చారు. బైలింగ్విల్ మూవీగా తెరకెక్కించి నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో టీజర్ లాంచ్ ఈవెంట్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాత మధుర శ్రీధర్ అశ్విన్ ఆర్ట్స్ బ్యానర్ లోగోను లాంచ్ చేయగా, హీరో సోహైల్ తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.

హీరో సోహైల్ మాట్లాడుతూ.. 'కన్నడ మూవీని తెలుగులో కూడా రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ మూవీ టైటిల్‌తో పాటు టీజర్ చాలా బాగుంది. కొత్త కంటెంట్‌ను తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు. కేజీయఫ్, కాంతారా దగ్గర నుంచి రీసెంట్‌గా వచ్చిన లవ్ టుడే, మహారాజా, 777 ఛార్లీ, మంజుమ్మల్ బాయ్స్ లాంటి కంటెంట్ బేస్డ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు మేం హిట్ చేశాం. ఈ మూవీ టీజర్ చూశాక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్లా అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. నందీశ్వర్ గారు చాలా బాగా తీశారు. రిషి గారి హైట్, పర్సనాలిటీకి ఇది కరెక్ట్ సినిమా. నాలుగు భాషల్లో ఈ సినిమా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా' అంటూ ఆల్ ద బెస్ట్ చెప్పారు.

నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ 'రిషి నటించిన కొన్ని కన్నడ సినిమాలు చూశా. ఆయన టెర్రిఫిక్ ఆర్టిస్ట్. తనతో పాటు టీం అందరికీ ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నా' అని అన్నారు.

చిత్ర హీరో రిషి మాట్లాడుతూ 'కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే మధుర శ్రీధర్ గారికి, సపోర్ట్ చేయడానికి వచ్చిన సోహైల్ గారికి ధన్యవాదాలు. దర్శకుడు మహి వి రాఘవ గారు 'సైతాన్' ద్వారా తెలుగు ఆడియన్స్‌కు నన్ను పరిచయం చేశారు. గరుడ పురాణం ఎలిమెంట్స్‌ను బేస్ చేసి రూపొందించిన చిత్రమిది. రుద్ర అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. 25 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ అయిన ఒక బస్.. అందులో చనిపోయిన వారంతా తిరిగి వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరమైన సినిమా. చాలా ప్యాషనేట్‌గా నందీష్ ఈ ఉత్పత్తి చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ మరోసారి అందిస్తారని కోరుకుంటున్నాను. ప్రస్తుతం కొన్ని తెలుగు ప్రాజెక్టులు చేస్తున్నా'అని చెప్పారు.

హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ…'ఈ చిత్రంలో భాగమవడం చాలా హ్యాపీగా ఉంది. మంచి కంటెంట్‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. ఈ సినిమా కూడా అందరికీ నచ్చేలా ఉంటుంది' అని చెప్పారు.

దర్శకుడు నందిష్ మాట్లాడుతూ..'మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన నిర్మాత మధుర శ్రీధర్ గారికి, హీరో సోహైల్ గారికి స్పెషల్ థ్యాంక్స్. మా హీరో రిషి ఇప్పటికే ఓ తెలుగు సినిమా చేశారు. ఈ కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నాం. టీజర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చేయాలనుకుంటున్నాం. దర్శకుడిగా నాకు, నిర్మాతగా లోహిత్ గారికి ఇది మా ఫస్ట్ మూవీ. టీజర్ అందరికీ నచ్చిందనుకుంటున్నా' అని అన్నారు.

నిర్మాత విజయ్ లోహిత్ మాట్లాడుతూ.. 'మ బ్యానర్ అశ్విని ఆర్ట్స్‌లో నిర్మాణం మొదటి సినిమా ఇది. బైలింగ్విల్ మూవీగా తెరకెక్కిస్తున్నాం. నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం. ఈ తెలుగు ప్రేక్షకులు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా' అని అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings