28
తెలుగు, తమిళ్ తో పాటు వివిధ భాషల్లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రంభ (రంభ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 1990-2000 టైంలో తన గ్లామర్ తో ప్రేక్షకులను ఫిదా చేసింది. అప్పుడప్పుడు బుల్లితెర మీద మెరుస్తున్న ఈ బ్యూటీ క్వీన్.. చాలాకాలంగా వెండితెరకు దూరంగా ఉంటుంది. 2010 లో ఇంద్రకుమార్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని కెనడాలో సెటిల్ అయింది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి. తాజాగా రంభ తన ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫొటోలు చూడముచ్చటగా ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద కుమార్తెలలో రంభ లాగే హీరోయిన్ కళ పెరిగింది. మరి భవిష్యత్ లో తల్లి బాటలో తను కూడా సినీ రంగ ప్రవేశం చేస్తుందేమో.