27
యూపీఐ వ్యవస్థలో కేంద్ర బ్యాంకు ఆర్బీఐ కీలక మార్పులను చేసింది. యూపీఐ ద్వారా చేసే పన్ను చెల్లింపుల పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలను నేడు ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూపీఐ కీలక మార్పు ఆయన తెలిపారు. దీనితో వ్యక్తిగత ఆదాయపు పన్ను, ఆస్తి పన్ను, ముందస్తు పన్ను చెల్లింపులు జరిపేవారు ఒక ట్రాన్సాక్షన్‌లో రూ.5 లక్షల వరకు చెల్లించే అవకాశం ఉంటుంది.