32
ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రుల్లో భాగంగా రెండో శుక్రవారం అమ్మవారు బ్రహ్మచారిణి అవతారంలో దర్శనం ఇచ్చారు. ఆలయ అర్చకులు అమ్మవారికి విశేష కుంకుమార్చన చేశారు. అనంతరం అమ్మవారికి పులిహోరను నైవేద్యంగా సమర్పించారు. శరన్నవరాత్రుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అవకాశం కలుగకుండా ఏర్పాట్లు చేశామని ఈవో విజయ రామారావు తెలిపారు.