Sliderఆంధ్రప్రదేశ్

పోలవరంపై పులివెందుల పంచాయతీ… మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

ఆంధ్ర ప్రదేశ్ : అధికార పార్టీ నేతలు పోలవరం ప్రాజెక్టు పై తప్పుడు ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్ పులివేందల పంచాయతీ పెట్టారని దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని, డ్యామ్ సైట్ లో గ్రామాలను ఖాళీ చేయించాకే నిర్మాణ పనులకు మార్గం సుగమమైందన్నారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే 70 శాతానికి పైగా పనులు పూర్తి చేశామని వెల్లడించారు. ఇప్పుడు ఎటువంటి నోటీసులు లేకుండా పనుల ఆపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comment here