25
ముద్ర ప్రతినిధి, నిర్మల్:మదకద్రవ్యాల నిరోధానికి పోలీస్ యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం రాత్రి నిర్మల్ లోని పలు వాణిజ్య సంస్థలపై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో పలు దుకాణాల్లో నిషేధిత గుట్కా పెద్ద ఎత్తున పట్టుబడింది. పోలీసులు పట్టుబడ్డ గుట్కా విలువ రూ.5 లక్షలకు పైగా ఉంటుందని. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ గుట్కా గంజాయి వంటి నిషేధిత పదార్థాలను అమ్మేవారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో జిల్లాను మత్తుపదార్థ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఆమె పేర్కొన్నారు.