Sliderతెలంగాణ

తెలంగాణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తలసాని శ్రీనివాస యాదవ్!

  • నేడు సచివాలయంలో బాధ్యతల స్వీకరణ
  • పశుసంవర్థక, మత్య్స, సినిమాటోగ్రఫి మంత్రిగా బాధ్యతలు
  • శుభాకాంక్షలు తెలిపిన నేతలు, అధికారులు

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నేత తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని సచివాలయంలో ఈరోజు పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ మంత్రిగా చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా తలసాని తెలిపారు.

Comment here