37
ముద్రా ప్రతినిధి, కరీంనగర్ :జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందారు. సమ్మిరెడ్డి ఎన్ ఎస్ యు ఐ విద్యార్థి నాయకుడి నుంచి సుదీర్ఘకాలం పనిచేస్తూ కాంగ్రెస్‌లో అంచలంచెలుగా ఎదిగారు. ఆయన హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.
సమ్మిరెడ్డి మృతి దిగ్బ్రాంతికరం
సమ్మిరెడ్డి మృతి పట్ల వెలిచాల రాజేందర్ రావు ప్రగాఢ సంతాపం గురించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సమ్మిరెడ్డి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబమనోధైర్యం కల్పించాలని ఆ దేవుడికి ప్రార్థిస్తున్నట్లు వెలిచాల రాజేందర్ రావు తెలిపారు.