తెలంగాణ

తాళం వేసిన ఇంట్లో చోరీ

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మండలంలోని రెడ్డిపేట్‌లో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై రాజు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన మంగళంపల్లి నరేష్‌ కటుంబసభ్యులతో కలిసి  రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. ఆయన శుక్రవారం ఇంటికొచ్చే చూసేసరికి తాళం పగిలిపోయి ఉండగా పోలీసులకు సమాచారాన్ని అందించారు. గృహంలో బంగారం, నగదు కలిపి రూ.4,30,000లను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Comment here