Home తెలంగాణ కోదాడ నియోజకవర్గంలో 100 కోట్లతో రోడ్లు అభివృద్ధి. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

కోదాడ నియోజకవర్గంలో 100 కోట్లతో రోడ్లు అభివృద్ధి. – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
కోదాడ నియోజకవర్గంలో 100 కోట్లతో రోడ్లు అభివృద్ధి. - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • కోదాడ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి మా లక్ష్యం.
  • కోదాడ పట్టణానికి వంద పడకల ఆసుపత్రి హాస్పిటల్ ప్రజల సౌకర్యార్థం సిటీ స్కాన్ ఏర్పాటు.
  • రైతుల కొరకు అన్ని లిఫ్టులు పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేపడుతున్నాము.
  • సంక్రాంతి తర్వాత రైతు భరోసా.
  • మోతే, నడిగూడెం, మునగాల మండలాల్లో పలు రోడ్లకి శంఖు స్థాపన చేసిన రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమురాలు పద్మావతి రెడ్డి

సూర్యాపేట/ కోదాడ ముద్ర ప్రతినిధి :- కోదాడ నియోజకవర్గం లో 100 కోట్లతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.సోమవారం మోతే మండల కేంద్రం మోతే నుండి NH 9 వరకు 12.8 కి. మీ లను 25 కోట్ల రూపాయలతో చేపట్టే పనులకు కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తో కలిసి నీటి పారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గం లో ని ప్రజలకి సాగు నీరు అందించి మంచి పంటలు పండే విధంగా చర్యలు తీసుకుంటామని,40 కోట్లతో రెడ్డి గుంటకు లిఫ్ట్ ఇచ్చామని,సాగునీటికి,త్రాగునీటికి, విద్య కొరకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు.

సామాన్యులకు అనుకూలంగా సౌకర్యాలు కల్పిస్తున్నామని, ఒక సంవత్సర పాలనలోనే 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించామని,కాళేశ్వరం ద్వారా చుక్కనీరు రాకపోయినా ఈ వానాకాలం రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాల్లో 45 లక్షల మంది రైతులు 1503 లక్షల మెట్రిక్ టన్నుల వారి ధాన్యాన్ని పండించారని మరెక్కడ ఇంత పంట రాలేదని మంత్రి తెలిపారు.

సన్నాసులకు 500 రూపాయల బోనస్ అందజేస్తాం సుమారుగా 40 కోట్ల రూపాయలు ఈసారి వారి ధాన్యం ఖాతాల వల్ల రైతులలో జమ చేస్తున్నాము మంచిగా పాలన అందిస్తాము అందరి ఆశీస్సులు పొందుతున్నాము ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం,మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు ఇస్తాము,రైతు భరోసా సంక్రాంతి పండుగ తర్వాత రైతు ఖాతాలో జమ,వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థుల కొరకు మిస్ చార్జీలు డైట్ చార్జీలు పెంచుతూ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అన్నారు.

తదుపరి బరఖాత్ గూడెం నుండి కాగితపు రామచంద్ర పురం వరకు 09:50 కి. మీ లను 20 కోట్ల రూపాయలతో చేపట్టే అలాగే డబుల్ రోడ్డు నిర్మాణం కాగిత రామచంద్ర పురం గ్రామం లో 25 కోట్ల రూపాయలతో చేపట్టే శాంతి నగర్ నుండి నడిగూడెం వరకు 12.20 కి. మీ ల డబుల్ రోడ్డు నిర్మాణం నడిగూడెం మండల నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయటం కోసం నిరంతరం కృషి చేస్తున్నాను ఈ రోడ్లు అయితే ప్రజల ఆస్తుల ధరలు పెరుగుతాయని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

అనంతరం 16 కోట్ల రూపాయలతో ఆకుపాముల నుండి రత్నవరం వరకు 7.5 కి. మీ ల డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు ఆకుపాముల గ్రామం లో నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్ల విషయం లో రాజీ పడకుండా మన్నిక కాలం ఎక్కువ ఉండేలా మెరుగులు దిద్దాలని మంత్రి అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో కోదాడ శాసనసభ్యులు జిల్లా ఉత్తమ్ పద్మావతి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు,మాజీ శాసనసభ్యులు వి. చందర్రావు, ఆర్డీఓ వేణుమాధవ్, ఏసీపీ నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఈఈ సీతారామయ్య, మోతే తాసిల్దార్ ఎస్ సంఘమిత్ర ప్రజాప్రతినిధులు సిబ్బందిని పరామర్శించారు.

You Might Also Like

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech