38
సూర్యాపేట ముద్రణ ప్రతినిధి :- అన్ని దానాల్లో కెల్లా అన్నదానం మహాదానమని, దుర్గామాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికీ ఉండాలని ఎన్నారై చలసాని రాజీవ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోల నాగరాజు అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, అన్నదానం దాత కోల నాగరాజు అరుణ దంపతుల ఆధ్వర్యంలో 25వ వార్డులోని చంద్రన్న కుంట, ముత్యాలమ్మ బజార్ నందు ఏర్పాటుచేసిన దుర్గామాత విగ్రహం వద్ద 15వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం అన్నదాన ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, దుర్గామాత నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు మోర నరేష్,నజీమ్,రామకృష్ణ, రాహుల్,నాగరాజు,ఇ సాయి, కే సాయి, ఎస్ సాయి, కె, అరవింద్,శ్రీకాంత్, తిరుమల్, ఇలాగే ఉన్నారు.