23
సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదివారం వారుజాము నుంచే తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటున్నారు. కాగా ఉదయం సీఎం రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి రేవంత్ రెడ్డికి ఆశీర్వచనాలు అందించారు. రేవంత్ రెడ్డి వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు.