Slider2తెలంగాణసినిమా

సైరా టీజర్ రిలీజ్

టాలీవుడ్ అగ్రనటుడు చిరంజీవి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ సినిమా మరికొన్ని వారాల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా, ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. సైరా హిందీ వెర్షన్ టీజర్ ను ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిరంజీవి తన అభిప్రాయాలు పంచుకున్నారు.

సైరా ఒక్క భాషకే పరిమితమైన సినిమా కాదని, దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు నచ్చే అంశాలతో నిండిన సినిమా అని స్పష్టం చేశారు. సైరా… ది బెస్ట్ కంటెంట్ అని చెబుతానని, తెలుగుతో పాటు హిందీ సహా అనేక భాషల్లో రిలీజ్ చేయడానికి కారణం ఈ నమ్మకమేనని అన్నారు. సైరా చిత్రాన్ని ఓ బాధ్యతగా భావించానని చిరంజీవి వెల్లడించారు.

Comment here