ఆంధ్రప్రదేశ్జాతీయ- అంతర్జాతీయ

దళితులకు అక్కడ భోజనం పెట్టరు..?

రోజులు మారినా, రాజులు పోయినా రాక్షస రాజ్యం ఇంకాపోలేదు. మూఢాచారాలతోపాటు, కుల వివక్ష నానాటికీ పెచ్చరిల్లుతోంది. తాజాగా  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలో ఓ టిఫిన్ సెంటర్ లో భోజనానికి వెళ్లిన దళితులకు చేదు అనుభవం ఎదురైంది. దళితులకు తమ భోజనశాలలో తినడానికి వీల్లేదని నిర్వాహకులు తేల్చిచెప్పేశారు. కావాలంటే ఎంతంటేఅంత పార్సిల్ చేసిస్తామని అన్నారు. ఈ విషయమై దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. భోజన శాల నిర్వాహకులపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

మా ఊరులో SC లు టిఫిన్ కోసం బీసీ వీధి వెళ్తే మీ SC వాళ్ళకి ప్లేట్స్ లో టిఫిన్ పెట్టము అన్నారు..

https://www.youtube.com/watch?v=txrNmFL2-a0

Comment here