తెలంగాణరాజకీయలు

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించి ఉత్తర్వులుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సంతకం చేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళికా సంఘం అత్యంగ కీలకమైనది కావడంతో అనుభువజ్ఞడైన వినోద్‌ కుమార్‌ను ఈ సంఘానికి ఉపాధ్యక్షుడిగా సీఎం నిర్ణయించారు. 2019-2020 ఆర్థిక సంవత్సరానికి త్వరలోనే పూర్తి స్ధాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవహారాలు సమీక్షించి ప్రతిపాదనలు తయార చేసే కీలక పనిని కూడా ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వ్యవహరించే వినోద్‌ కుమార్‌కు సీఎం అప్పగించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యాక్షుడిగా కేబినెట్‌ సమావేశాలకు శాశ్వత ఆహ్వాతుడిగా ఉంటారు. వినోద్‌ కమార్‌ ఈ పదవిలో 3ఏళ్లు కొనసాగుతారు.

Comment here