Sliderఆంధ్రప్రదేశ్జాతీయ- అంతర్జాతీయతెలంగాణ

మోడీ, ట్రంప్ భేటీకి ప్రాధాన్యత

జీ-7 దేశాల కూటమిలో భారత్‌కు సభ్యత్వం లేకపోయినప్పటికీ.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యూల్ మాక్రాన్ వ్యక్తిగత ఆహ్వానంపై ప్రధాని నరేంద్ర మోడీ.. జీ-7 సదస్సులో ప్రత్యేక అతిధిగా
పాల్గొంటున్నారు. భారత్ ప్రధాని, ఫ్రాన్స్ అధ్యక్షుడి మధ్య ఉన్న వ్యక్తిగత సాన్నిహిత్యానికి.. ఈ ఆహ్వానమే సూచికని తెలిపింది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ. అలాగే అంతర్జాతీయంగా భారత్
బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోందన్న వాస్తవాన్ని కూడా ఈ ఆహ్వానం ద్వారా ఫ్రాన్స్ గుర్తించినట్టు తెలిపింది. ఇవాళ జీ7 సదస్సులో పర్యావరణం, డిజిటల్‌ రూపాంతరీకరణ అంశాలపై ప్రధాని మోడీ
ప్రసంగించనున్నారు.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ కానున్నారు. ఇరువురి మధ్య 40 నిమిషాల పాటు చర్చ జరిగే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3.45 గంటలకు ఈ భేటీ జరిగే
అవకాశం ఉంది. వాణిజ్య నిబంధనలు, ఇతర అంశాలపై మోదీ, ట్రంప్‌ చర్చిస్తారని సమాచారం. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత నెలకొన్న పరిస్థితులు, సీమాంతర ఉగ్రవాదం ప్రోత్సహిస్తోన్న పాక్‌
వైఖరి పైనా చర్చించే ఛాన్స్‌ ఉంది. సదస్సులో పాల్గొంటున్న దేశాధినేతల మధ్య భేదాభిప్రాయాలున్నాయన్న కథనాలను కొట్టిపారేసింది ఫ్రాన్స్‌. అయితే.. సంరక్షణాత్మక వాణిజ్య విధానాలు, పర్యావరణ
మార్పు, ఇరాన్‌, డిజిటల్‌ టెక్నాలజీ దిగ్గజాలపై యూనివర్సల్‌ ట్యాక్స్‌ విధింపు.. ఇలా పలు అంశాలపై ఏడు దేశాల మధ్య విభేదాలున్నాయి.

Comment here