Sliderక్రీడలు

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న అఫ్గాన్

ప్రపంచకప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌-బంగ్లాదేశ్‌ మధ్య మరికాసేపట్లో మ్యాచ్‌ మొదలు కానుంది. ఇందులో భాగంగా అఫ్గాన్ జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్‌ నుంచి నిష్క్రమించిన అఫ్గాన్‌ జట్టు ఈ మ్యాచ్‌లోనైనా విజయం సాధించి పరువు నిలుపుకోవాలని చూస్తోంది. మరోవైపు బలమైన బ్యాటింగ్, బౌలింగ్‌ లైనప్‌తో జోరు మీదున్న బంగ్లా సెమీస్‌ బెర్తుకోసం ప్రయత్నిస్తోంది. సౌథాంప్టన్‌లో వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది.

అఫ్గానిస్థాన్‌ జట్టు: గుల్బాదిన్‌ నైబ్‌, సమీవుల్లా షిన్వారీ, రెహ్మత్‌ షా, హష్మతుల్లా షాహిది, అస్గార్‌ అఫ్గాన్‌, మొహమ్మద్‌ నబీ, నజీబుల్లా జద్రాన్‌‌, ఇక్రామ్‌ అలీ ఖిల్‌, రషీద్‌ ఖాన్‌, దవ్లాత్‌ జద్రాన్‌, ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌.

బంగ్లాదేశ్‌ జట్టు: తమీమ్‌ ఇక్బాల్‌, సౌమ్యా సర్కార్‌, షకీబ్‌ఉల్‌ హసన్‌, ముష్పికర్‌ రహీమ్‌, లిటన్‌ దాస్‌, మహ్మదుల్లా, మొసదీక్‌ హసన్‌, మహమ్మద్‌ సైఫుద్దీన్‌, మెహిదీ హసన్‌, ముష్రఫే మోర్తజా, ముస్తాఫిజర్‌ రెహ్మాన్‌.

Comment here