Slider2జాతీయ- అంతర్జాతీయభక్తి

కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌కు భారీ ఆదాయం

అత్తివరదర్ ఉత్సవాల సందర్భంగా కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌కు హుండీ ద్వారా రూ.9.90 కానుకలు వచ్చాయి. గత నెల ఒకటో తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఈ నెల 17తో ముగిశాయి. స్వామికి భక్తులు చెల్లించే కానుకల కోసం ఆలయ ప్రాంగణంలో మొత్తం 18 హుండీలను ఏర్పాటు చేశారు. తాజాగా వీటిని లెక్కించగా రూ.9.90 కోట్ల నగదు, 164 గ్రాముల బంగారం, 4,959 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్టు కలెక్టర్ పొన్నయ్య తెలిపారు. ఇప్పటి వరకు 13 హుండీలను మాత్రమే లెక్కించామని, త్వరలోనే మిగతా హుండీలను కూడా లెక్కిస్తామని కలెక్టర్ తెలిపారు.

Comment here