Sliderజాతీయ- అంతర్జాతీయ

ఇరాన్ దిశ‌గా అమెరికా యుద్ధ నౌక‌

హైద‌రాబాద్: అమెరికా యుద్ధ నౌక యూఎస్ఎస్ అబ్ర‌హ్మం లింక‌న్‌.. ఇరాన్ దిశ‌గా వెళ్తోంది. ఇరాన్‌తో ప్ర‌స్తుతం ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్న నేప‌థ్యంలో యుద్ధ నౌక‌ను గ‌ల్ఫ్ దిశ‌గా అమెరికా పంపిస్తోంది. ఈ విష‌యాన్ని అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు జాన్ బోల్ట‌న్ చెప్పారు. అనేక సంక్లిష్ట‌, ఉద్రిక్త సంకేతాలు అందుతున్న నేప‌థ్యంలో ఈ చ‌ర్య చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. అమెరికా సంయుక ద‌ళాలపై దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్న ముందుచూపుతో యుద్ధ నౌక‌ను త‌ర‌లిస్తున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ ద‌ళాల‌పై దాడి జ‌రిగితే నిస్సంకోచంగా ప్ర‌తిదాడి చేస్తామ‌ని బోల్ట‌న్ చెప్పారు. ఇరాన్‌తో యుద్ధం చేయాల‌న్న ఉద్దేశం త‌మ‌కు లేదు, కానీ ప‌రిస్థితి అనివార్య‌మైతే యుద్ధ నౌక‌ను వినియోగిస్తామ‌ని బోల్ట‌న్ తెలిపారు. ఇరాన్ చేప‌డుతున్న అణు కార్య‌క్ర‌మాల‌ను అమెరికా వ్య‌తిరేకిస్తున్న‌ది. ఈ నేప‌థ్యంలో అగ్ర‌రాజ్యం అనేక ఆంక్ష‌లు కూడా విధించింది. అయినా ఇరాన్ మాత్రం యురేనియం ఎగుమ‌తులు చేస్తోంది. ఇరాన్‌తో ఉన్న అణు ఒప్పందాన్ని ఇటీవ‌ల అమెరికా త్య‌జించిన విష‌యం తెలిసిందే

Comment here